తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన ఎల్ రమణ సోమవారం నాడు కారెక్కారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు. రమణ ఇటీవలే ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం అయి తన చేరిక అంశంపై చర్చించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి మరీ ఎల్ రమణను కెసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు.