రాహుల్ నుంచి అంతకంటే ఏమి ఆశిస్తాం

Update: 2020-12-28 06:47 GMT

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బిజెపి నేత కుష్భూ విమర్శలు గుప్పించారు. ఆయన విదేశీ పర్యటనపై వ్యంగాస్త్రాలు సంధించారు. ఆయన నుంచి ఇంత కంటే ఎక్కువ ఆశించలేమన్నారు. ఓ వైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమం నడుస్తోంది. రాహుల్ గాంధీ కూడా వారికి మద్దతుగా పలుమార్లు స్పందించారు. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలసి చట్టాలను రద్దు చేయాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నాకు దిగగా..పోలీసులు అడ్డుకోవటంతో ఒకింత ఘర్షణ కూడా జరిగింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటన తలపెట్టడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ గాంధీ ఆదివారం ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇటలీలోని మిలన్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పర్యటనపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

'రైతుల ఉద్యమం గురించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రస్తుతం రాహుల్‌ గాంధీ ఎక్కడ ఉన్నారు? కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుంటున్నారా.. నిజమా..? మీకు రైతుల పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు మాట్లాడతారు.. అదే నిజమైతే మీరు వారితో కలిసి వీధుల్లో ఉండాలి కానీ.. ఇలా విదేశాల్లో ఎంజాయ్‌ చేయడం ఏంటి?' అంటూ ట్వీట్‌ చేశారు. 'రాహుల్‌ గాంధీ నుంచి నేను ఇంతకు మించి ఇంకేమైనా ఆశించగలనా.. ఖచ్చితంగా కాదు. అసలు నేను ఆయన వ్యక్తిగత విదేశి పర్యటన వార్త గురించే ఎదురు చూస్తున్నాను. ఆయన మాటలన్ని ఉత్తి డ్రామా. కొత్తగా ఏం లేదు.. అంతా పాతదే' అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News