ఈటెలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

Update: 2021-05-06 16:25 GMT

తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది కీలకంగా మారింది. ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేక కలసి వచ్చే నాయకులతో కొత్త పార్టీ ప్రారంభిస్తారా అన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం రాత్రి ఈటెల రాజేందర్ తో భేటీ అయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ తనకు పాత మిత్రుడని అన్నారు. ఈటెల భార్య జమున తమకు బంధువు అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఒక బంధువుగానే ఈటెలను కలిశానని చెప్పారు. బర్తరఫ్ వార్త విని సానుభూతి తెలిపానన్నారు. రాజకీయ నాయకుడిగా ఈటెల నివాసానికి వెళ్లలేదని, రాజకీయాలు మాట్లాడలేని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని, అందులో ఇది ఒకటి అని కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News