బిఆర్ఎస్ కు మింగుడుపడని ఫలితాలు !

Update: 2023-05-13 08:12 GMT

కర్ణాటకలో బీజేపీ ఓటమిపై తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ ఎంత సంతోషపడుతుందో తెలియదు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయం సాధించటం మాత్రం ఆ పార్టీ కి ఏ మాత్రం మింగుడుపడని విషయమే. ఎందుకంటే తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల మద్యే ఉంటుంది అనేది తెలిసిన విషయమే. బీజేపీ కూడా తెలంగాణ లో అధికారంలోకి రావాలనే రేస్ లో ఉన్నా కర్ణాటక ఫలితాలు ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లితే...కాంగ్రెస్ పార్టీ కి కొత్త జోష్ ఇస్తాయనటంలో సందేహం లేదు. ఒక రకంగా కర్ణాటక ఫలితాలు బిఆర్ఎస్ కు షాక్ వంటివే అని చెప్పాలి. ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

                                అదే సమయంలో తమకు పోటీ కాంగ్రెస్ తోనే తప్ప బీజేపీ తో కాదు అన్నారు. బీజేపీ సోషల్ మీడియా లో ఉంది తప్ప క్షేత్ర స్థాయిలో లేదు అన్నారు.వచ్చే ఆరునెలల్లోనే తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కు బూస్ట్ ఇస్తాయనటంలో సందేహం లేదు. దక్షిణాదిలో అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ చేతికి రావటం..అది కూడా స్పష్టమైన..పూర్తి మెజారిటీతో అన్నది అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పునర్జీవానికి ఇది ఇక టానిక్ గా ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు.

Tags:    

Similar News