ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ ఇవ్వాలంటూ కాకతీయ యూనివర్శిటీ జెఏసీ నేతలు ముఖ్యమంత్రి కెసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు అప్రమత్తం అయి విద్యార్ధులను అరెస్ట్ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలు కార్యక్రమల్లో పాల్గొనేందుకు సోమవారం వరంగల్ కు వచ్చిన కెసీఆర్ కు నిరసన తెలిపేందుకు విద్యార్ధులు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి నిరసన తలపెట్టారు.