జో బైడెన్..కమలా హ్యారిస్ ట్విట్టర్ బయోల్లో మార్పు

Update: 2020-11-09 04:24 GMT

అత్యంత ఉత్కంఠగా మారిన అమెరికా ఎన్నికల్లో పలితాలు వెల్లడైనా సరే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మంకు పట్టు వీడటం లేదు. ఓటమిని అంగీకరించటం లేదు. అయితే ఇప్పటికే అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్ లు మాత్రం తమ ట్విట్టర్ ఖాతాల్లో మార్పులు చేశారు. అమెరికాకు జో బైడెన్ 46వ అధ్యక్షుడుగా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జో బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రెసిడెంట్ ఎలక్ట్, డాక్టర్ జిల్ బైడెన్ కు భర్త, ఫ్రౌడ్ పాదర్, గ్రాండ్ ఫాదర్ అని పేర్కాన్నారు.

అంతే కాదు అమెరికన్లు అందరి కోసం కొత్త అమెరికా నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కమలా హ్యారిస్ కూడా అదే తరహాలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్, సేనేటర్, వైఫ్, ప్రజల కోసం పోరాటం చేస్తానంటూ ఖాతాకు జత చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ఇమ్యూనిటీని కోల్పోతారు. గతంలో లాగా అభ్యంతకర, లేదా తప్పుడు సమాచారం తో కూడిన ట్వీట్లు పెడితే వాటిని ట్విట్టర్ తొలగిస్తుంది.

Tags:    

Similar News