జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన

Update: 2020-11-17 11:00 GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన
  • whatsapp icon

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీకి చెందిన యువ కార్యకర్తల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు పోటీపై ఆసక్తిచూపుతున్నారని..ఈ మేరకు పార్టీ కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ... ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయని తెలిపారు. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుందని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Tags:    

Similar News