రేవంత్ పై జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం

Update: 2021-09-24 08:14 GMT

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా న‌డపాల‌ని చూస్తే కుదర‌ద‌న్నారు. చ‌ర్చ‌లు లేకుండా రెండు నెల‌ల కార్య‌క్ర‌మం ఎలా ఖ‌రారు చేస్తార‌ని ఆయ‌న ప్రశ్నించారు. వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం ఆరాట‌ప‌డితే కాంగ్రెస్ లో సాధ్యంకాద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్‌గా ఉన్నా అవమానాలు చేస్తున్నారని, తాను టీఆర్ఎస్‌లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించారు.

గజ్వేల్ సభలో గీతా రెడ్డీ తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. గీతా రెడ్డి అంటే గౌరవమే..కానీ గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందన్నారు. తాను కూడా రెండు లక్షల మందితో సభ పెట్టగలనని, రాష్ట్రంలో తనకూ అభిమానులు ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసే తనకే అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకడం లేదు కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు.

Tags:    

Similar News