రెండు రాష్ట్రాల‌ను క‌లిపేద్దామంటే నాకు ఓకే

Update: 2021-10-30 14:19 GMT

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్ర దిశ‌గా టీఆర్ఎస్, వైసీపీ కుట్ర చేస్తున్నాయ‌ని ఆరోపిస్తుంటే అందుకు భిన్నంగా జ‌గ్గారెడ్డి రెండు రాష్ట్రాల‌ను క‌లిపేస్తామంటే త‌న‌కు ఓకే అన్నారు. అయితే ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం అని తెలిపారు. తాను మొద‌టి నుంచి స‌మైక్య‌వాదినే అన్నారు. అప్ప‌ట్లోనూ త‌న‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రీక‌రించార‌ని..అయినా విజ‌యం సాధించాన‌న్నారు. జ‌గ్గారెడ్డి శనివారం అసెంబ్లీ హాల్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ''సమైక్యరాష్ట్రం పేరుమీద ఏపీ- తెలంగాణ అధికార పార్టీలు కొత్త డ్రామా స్టార్ట్ చేశాయి. ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలు ఆనాడే నేను అన్నాను. కేసీఆర్ రాజకీయాలను ప్రజలు గమనించాలి. కేసీఆర్ రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే నేను మద్దతు ఇస్తా.

రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ మంత్రి నాని అన్నారు కదా. నా స్టాండ్ మొదటినుంచి సమైక్యరాష్ట్రమే'' అని తెలిపారు.''నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దు అని పీసీసీలో ఎక్కడా లేదు. ''కేసీఆర్ వ్యాఖ్యలు ప్లీనరీలో రాజకీయంగా అయోమయానికి గురయ్యేవిధంగా ఉన్నాయి. బీజేపీ గోడమీద ఉన్న పిల్లిలాంటిది.ఏటు వీలైతే అటు మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ హోదాలో అన్నారు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం అంటున్నాను. ప్రస్తుతం ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు.. ఆత్మబలిదానం చేసుకున్న వారు కోరుకున్నట్లుగా తెలంగాణ లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలీదు' అన్నారు.

Tags:    

Similar News