ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదని..ఇది ఎనిమీ ప్రభుత్వం అన్నారు. సోము వీర్రాజు గురువారం నాడు ఎంపీ టీ జీ వెంకటేష్, విష్ణు వర్థన్ రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ పేరిట ఉద్యోగులను నట్టేట ముంచారని విమర్శించారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించి ఇవ్వటం మోసం చేయటమే. హెచ్ఆర్ఏ తగ్గించటం దారుణమన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదని . ఏరియర్స్ గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా మాట్లాడటంలేదన్నారు. . కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో చాలా తేడా ఉంటుంది. అవేమీ పట్టించుకోకుడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము ఉద్యోగుల తరపున అండగా ఉంటామన్నారు. వారి తరపున పోరాటం చేస్తామన్నారరు.
ఆత్మకూరు ఘటన విషయంలో వైసీపీ ప్రభుత్వం ద్వంద వైఖరిని అనుసరిస్తోందని ఆరోపించారు. హిందులు పట్ల ఒక రకంగా. ముస్లిం తీవ్ర వాద సంస్థల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఐపీసీని అమలు చేయటంలోనూ ఇలాగే చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకం సోషల్ మీడియాలో పోస్టు పెడితే స్టేషన్ బెయిల్ ఇచ్చారు..అదేముస్లింలకు వ్యతిరేకంగా పోస్టు పెడితే రిమాండ్ కు పంపారు. హోం మంత్రి వీటిని ఎలా అనుమతిస్తున్నారు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒకే సెక్షన్లతో కేసు పెట్టి అమలు విషయంలో మాత్రం తేడాలు చూపించారన్నారు. ముస్లింలకు మాత్రం స్టేషన్ బెయిల్..బిజెపి కార్యకర్త..హిందువును మాత్రం రిమాండ్ కు పంపారన్నారు. అధికారులు..ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చెప్పటానికి ఇదో మచ్చుతునక అన్నారు. ఇది మత తత్వ ప్రభుత్వం అని సోము వీర్రాజు ఆరోపించారు.