కరోనా బారిన పడ్డ జె పీ నడ్డా

Update: 2020-12-13 16:15 GMT

తాజాగా పశ్చిమ బెంగాల్ పర్యటనలో టీఎంసీ కార్యకర్తల దాడిని ఎదుర్కొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. నడ్డా త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్‌ వేదికగా ఆకాక్షించారు.

Tags:    

Similar News