కెసీఆర్ ప్రధాని అయితే దేశ చరిత్రే మారిపోతుంది

Update: 2021-03-25 12:29 GMT

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ ఒక సారి దేశ ప్రధాని కావాలని ఆకాక్షించారు. కెసీఆర్ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళతారని..దేశ చరిత్రే మారిపోతుందని అన్నారు. అసెంబ్లీలో కార్మిక శాఖకు చెందిన పద్దుపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్మిక సంక్షేమానికి కెసీఆర్ సారధ్యంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ ల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శలు చేశారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని ఆరోపించారు. గత కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయ తెలిసిందే.

Tags:    

Similar News