సినీ నటుడు అలీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు. కొద్దిరోజుల క్రితమే సీఎం జగన్ ఆయనకు ఈ పదవి ఇచ్చారు. అధికార వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడుతోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ దగ్గరనుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ పై ఎటాక్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జనసేన, టీడీపీ లు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉండటమే. మంగళవారం నాడు అలీ కీలక వ్యాఖలు చేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీకి రెడీ అని ప్రకటించారు. జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచి అయినా పోటీ చేస్తానన్నారు.
సినిమాలు వేరు, రాజకీయం వేరు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తుంది ఎవరో అందరికి తెలుసు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు సహజమే అన్నారు.ఒకప్పుడు పవన్ కళ్యాణ్, అలీ చాలా సన్నిహితంగా ఉండేవారు. అసలు అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఉండేది కాదు. కానీ తర్వాత ఎక్కడో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. తాజాగా అలీ చేసిన ప్రకటనతో ఇది మరింత పెరగటం ఖాయం. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించే ఛాన్స్ ఉండదు కానీ...జనసేన శ్రేణులు ఉరుకుంటాయా...అలీ పై విమర్శల దాడి చేయటం స్టార్ట్ చేస్తాయనే చెప్పొచ్చు.