
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో కలకలం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ఎన్నికల కార్యక్రమం ముగించుకుని కారులో ఢిల్లీ వెళుతున్న సమయంలో ఆయన కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి. తన కాన్వాయ్ పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. చాజర్సీ టోల్ పాల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్లు ఆయన ఓ మీడియా సంస్థకు తెలిపారు.
మీరట్ లోని కితూర్ లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని ఆయన ఢిల్లీ వెళుతున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. తన కారు కాల్పుల్లో దెబ్బతినటంతో మరో వాహనంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి తన వాహనంపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.