తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్నా నేతలు పార్టీలు మారటం ఆగటం లేదు. ఇటీవల బీజేపీ కి గుడ్ బై చెప్పిన విజయశాంతి శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతః కొంత కాలంగా విజయశాంతి తెలంగాణ బీజేపీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఇటీవలే బీజేపీ కి చెందిన కీలక నేతలు వరసగా పార్టీ మారిన విషయం తెలిసిందే. తెలంగాణాలో బిఆర్ఎస్ ప్రత్యామ్యాయం కాంగ్రెస్ పార్టీనే అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల బరిలో విజయశాంతి నిలిచే అవకాశం ఉంది అనే ప్రచారం కాంగ్రెస్ నేతల్లో ఉంది.