జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజే అబే పై కాల్పులు..ప‌రిస్థితి విష‌మం

Update: 2022-07-08 05:00 GMT


జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజేఅబే ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత సంకిష్టంగా మారింది. శుక్ర‌వారం నాడు ఆయ‌న ఓ స‌మావేశంలో ప్ర‌సంగిస్తుండ‌గా ఆక‌స్మాత్తుగా ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగాయి. రెండు బుల్లెట్లు ఆయ‌న ఛాతీలోకి వెళ్ళాయి. దీంతో ఆయ‌న వేదిక‌పైనే ర‌క్తంతో కుప్ప‌కూలిపోగా..వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నా ఆయ‌న నుంచి స్పంద‌న రావ‌టం లేద‌ని స‌మాచారం. షింజే అబే మాట్లాడుతుండ‌గా వెన‌క నుంచి వ‌చ్చిన దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. మొద‌టిసారి బుల్లెట్ వ‌చ్చిన స‌మ‌యంలో పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌లేద‌ని..రెండ‌వ‌సారి కాల్చిన‌ప్పుడు శబ్దంతోపాటు పొగ కూడా వ‌చ్చింద‌ని ఈ ఘ‌ట‌న చూసిన వాళ్ళు వెల్ల‌డించారు. న‌గ‌రంలో లిబ‌ర‌ల్ డెమెక్రాటిక్ అభ్య‌ర్ధుల త‌ర‌పున ప్ర‌చారం చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

                             అయితే షింజే అబేపై దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌పంచ దేశాలు ద్రిగ్భాంతికి గుర‌య్యాయి. అబేపై కాల్పులు జరిపిన చోట నుంచి పోలీసులు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన షింజో అబే 1993లో జపాన్ దిగువ సభకు ఎన్నికయ్యారు. అబే తొలిసారిగా 2006లో జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీవిరమణ చేశారు. ఆ త‌ర్వాత సుదీర్ఘ కాలం ప్ర‌ధానిగా ప‌నిచేసి రికార్డు నెల‌కొల్పారు.

Tags:    

Similar News