క‌విత‌కు కెసీఆర్ బీ ఫామ్ ఇచ్చినా ఓడిపోయింది..నేను ప్ర‌తిసారి గెలిచా.

Update: 2021-06-04 05:02 GMT

ఎమ్మెల్యే ప‌ద‌వికి..టీఆర్ఎస్ కు రాజీనామా

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అదే స‌మ‌యంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న శుక్ర‌వారం నాడు త‌న నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి మీద ఓ అనామ‌కుడు ఉత్త‌రం రాస్తే రాత్రికి రాత్రే భ‌ర్త‌ర‌ఫ్ చేశారు. ఉరి తీసేవాడిని కూడా చివ‌రి కోరిక ఏంటి అని అడుగుతారు. క‌నీసం నా విష‌యంలో వివ‌ర‌ణ కూడా కోర‌లేదు. క‌నీసం ఏమి జ‌రిగిందో తెలుసుకోలేదు. హుజూరాబాద్ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది నాకు. నేను ఏ రోజూ ప‌ద‌వుల కోసం పాకులాడ‌లేదు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని ఎగ‌రేసిన క‌రీంన‌గ‌ర్ జిల్లా. తెలంగాణ ప్ర‌జ‌లు ఆక‌లిని అయినా భ‌ర్తిస్తారు. కానీ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌కొడితే స‌హించ‌రు.

ఈ రోజు డ‌బ్బుల‌తో..కుట్ర‌ల‌తో..కుతంత్రాల‌తో..డ‌బ్బు సంచుల‌తో గెలిస్తే గెల‌వొచ్చు. ఎందుకొచ్చింది గ్యాప్ అంటున్నారు చాలా మంది. ఈ గ్యాప్ ఇవాళ రాలేదు. టీఆర్ఎస్ లో అవ‌మానాలు నాకు ఒక్క‌డితే కాదు. హ‌రీష్ రావు కూడా జ‌రిగాయి. కెసీఆర్ సొంత కూతురికి బి ఫామ్ ఇచ్చినా ఓడింది. కానీ నేను బీ ఫామ్ ఇచ్చిన ప్ర‌తిసారి గెలిచా. సీఎం ఆఫీసులో ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీస‌ర్..ఎస్టీ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఉన్నారా? తెలంగాణ వ‌స్తే ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చెప్పావు. క‌నీసం సీఎం ఆఫీసులో కూడా ద‌ళిత ఆఫీస‌ర్లు..బీసీలు ఎక్క‌రైనా ఉన్నారా? . ఈటెల‌ను ప్రాణం ఉండ‌గానే బొంద పెట్టాల‌ని చూశారు. 

Tags:    

Similar News