మాజీ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో శాసనసభ కార్యదర్శికి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్ లో అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దగ్గర ఉన్న వందల కోట్లతో తనను ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయినా తనకు నియోజకవర్గ ప్రజలే బలం అని వ్యాఖ్యానించారు. కొంత మంది డబ్బు వెదజల్లి ఓడిస్తే ప్రయత్నం చేస్తారు..రాజీనామా వద్దని కోరారని..తాను ప్రజలను నమ్ముకున్నానని తెలిపారు. కెసీఆర్ అనే నియంత నుంచి తెలంగాణకు విముక్తి కల్పించటమే తన ధ్యేయం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరికీ గౌరవం లేదన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. హుజూరాబాద్ లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటెల తెలిపారు. కెసీఆర్ వెకిలి చేష్టలు..చిల్లర పనులు మానుకోవాలన్నారు.
రాజీనామా సమర్పణకు ముందు ఈటెల అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ కు ఇద్దాం అనుకున్న కానీ స్పీకర్ గారు కరోనా అడ్డం పెట్టుకొని కలవలేదు. అనివార్య మైన పరిస్థితుల్లో సెక్రెటరీ కి ఇచ్చాను. అసెంబ్లీ లో అంతా నియంతృత్వం . గతంలో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాలు అన్నీ తుంగలో తొక్కారు. మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ కారుడు ఏనుగు రవీందర్ రెడ్డి నీ కూడా అనుమతించలేదు. అసెంబ్లీ ప్రజల ఆశలను ప్రతిబింబించాలి కానీ ఇక్కడ కెసిఆర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అమలవుతుంది. కెసిఆర్ ఈ రాజ్యాంగం ఎంది, ఎమ్మెల్యే ఎంపీ లు ఎంటి అనే భావనలో ఉన్నారు దాని ప్రతి బింబమే ఈరోజు మాకు ఎదురైన అనుభవం. చిల్లర ప్రయత్నాలు సాగవు. హుజూరాబాద్ లో ఇన్నాళ్లు పెన్షన్ లేదు కానీ ఇప్పుడు ఆగ మేఘాల ఎన్నికల కోసం మీద పెన్షలు ఇస్తున్నారు.
నాకు మద్దతు తెలపక పోతే ఆపెస్త అంటున్నారు అట నే ఇంట్లో నుండి ఇవ్వడం లేదు గుర్తు పెట్టుకో.. హుజూరాబాద్ చైతన్యం గడ్డ ఇలాంటి వాటిని తొక్కి పడేసి ధర్మాన్ని గెలిపిస్తరు. ధర్మం, అధర్మం, డబ్బు సంచులకి ఆగౌరవనికి మధ్య జరిగే పోరాటం. నా డీఎన్ ఏ అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక లక్షం గా రైట్ పార్టీలో చేరుతున్నా. ఆర్ఎస్ యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకూ అందరూ నియంతను ఓడించేందుకు ముందుకు వస్తున్నారు. 20 ఏళ్ల తరువాత 2021 లో తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమం మొదలు పెడుతున్నాము. కేటీఆర్ 2018 లోనే కౌశిక్ రెడ్డి కి డబ్బులు పంపించి నా ఓడ గొట్టడనికి ప్రయత్నం చేశారు. నా ఇంటిమీద రైడ్ చేయించారు. ఇవన్నీ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అయ్యారు. బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యారు.నన్ను కాల గర్భంలో కలపాలి అనుకుంటున్నారు కానీ అది రివర్స్ అవుతుంది. నియంత పాలన అంతం అవుతుందని వ్యాఖ్యానించారు.