దేవుడి దయ ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

Update: 2020-12-16 07:39 GMT

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ వ్యవహారంపై తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ ఉంటే ఎప్పుడో ఓ సారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వస్తుందని అన్నారు. అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వటం సాధ్యం కాదన్నారు. అయితే ప్రభుత్వం ఏటా కొన్ని ఇళ్ళు కడుతూనే ఉంటుందని అన్నారు. లక్షల్లో ఎవరూ ఇళ్ళు కట్టి ఇవ్వలేరన్నారు. కట్టే ఇళ్ళు చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా లాటరీలో కేటయిస్తామని తెలిపారు. పేద వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాటి ప్రకారమే లాటరీ తీస్తామన్నారు. పది సంవత్సరాలో...పది హేసు సంవత్సరాల్లోనే ఇది పూర్తవుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే బుధవారం నాడు హైదరాబాద్ లోని వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 28.03 కోట్ల వ్యయంతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక లీవింగ్ రూమ్, రెండు బెడ్ రూమ్ లు, ఒక కిచెన్ రూమ్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.8.65 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు ఉచితంగా కేటాయించారు. ఈ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగు నీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సెఫిటీ, సీ.సీ.రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News