అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి సీట్లు తగ్గే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే పలు ప్రాంతీయ పార్టీల విషయం లో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం అంటే అంతా ఈజీ కాదు అని తెలుసు కాబట్టే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా లోక్ సభ సీట్లు తమ నుంచి చేజారిపోకుండా బీజేపీ ఎత్తులు వేస్తుంది అనే ప్రచారం కూడా బలంగా ఉంది. అయితే అటు ప్రధాని మోడీ, ఇటు హోమ్ మంత్రి అమిత్ షా లు ఏమి చేసినా కూడా పక్కా లెక్కల ప్రకారమే చేస్తారు అనే విషయం తెలిసిందే. మరి ఈ లెక్కల చిక్కుముడులు వీడాలంటే కొద్ది కాలం ఆగితే కానీ తేలదు. మరో వైపు సోము వీర్రాజు అధికార వైసీపీ తో కలిసి ముందుకు సాగారు అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ఇప్పుడు ఆయన్ను తొలగించటంతో బీజేపీ వైఖరి మారుతుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో స్టార్ట్ అయింది. . అయితే బీజేపీ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ అంచనాకు వచ్చినా అది తొందరపాటు అవుతుంది అని చెపుతున్నారు.