ఈటెల రాజేందర్ వ్యవహారం బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య రాజకీయ వేడి పెంచుతోంది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈటెల ఆత్మగౌరవాన్ని బిజెపికి తాకట్టుపెట్టారా అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తే..బిజెపి నాయకురాలు డి కె అరుణ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఆత్మగౌరవం ఉన్న వారెవరూ టీఆర్ఎస్ లో ఉండరని వ్యాఖ్యానించారు.
వందల కోట్లు పెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ లో అసలు ఇప్పుడు ఉద్యమకారులు ఎవరున్నారు అని ఆమె ప్రశ్నించారు. అక్కడ ఉన్న వారికి అసలు ఆత్మలు ఉంటే కదా గౌరవం ఉండటానికి అంటూ ఎద్దేవా చేశారు. ఇతరుల ఆత్మగౌరవాల గురించి మాట్లాడే అర్హత పల్లాకు లేదన్నారు.