తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కెసీఆర్ శనివారం రాత్రి ప్రధాని నరేందమోడీతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు ఎప్ఆర్ బీ ఎం పెంపు తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. అరగంటకుపైగా వీరిద్దరి సమావేశం జరిగింది. హైదరాబాద్ కు వరద సాయం అంశంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెబుతున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కెసీఆర్ వరస పెట్టి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. శనివారం నాడు ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు.