కెసీఆర్ అంబేద్క‌ర్ ను అవ‌మానించారు

Update: 2022-02-02 09:54 GMT

దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ ముఖ్య‌మంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్య‌లపై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ మండిప‌డ్డారు. ఆయ‌న క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగం, 400 సంవ‌త్స‌రాల కింద‌టి నిరంకుశ పాల‌న తేవాల‌నుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలనటం అంబేద్కర్‌ను అవమానించటమేనని పేర్కొన్నారు. అంబేద్కర్‌ భిక్షతోనే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. దళితబిడ్డ రాష్ట్రపతిగా.. చాయ్ వాలా ప్రధానిగా ఉన్నారంటే అంబేద్కర్‌ పుణ్యమేనన్నారు.

కేసీఆర్ సంస్కార హీనమైన మాటలు వినలేక ప్రజలు టీవీలు బంద్ పెట్టారన్నారు. కేసీఆర్ బూతు పురాణంపై తెలంగాణ పట్టణాలు, పల్లెల్లో చర్చ జరుగుతోందని ఈటల పేర్కొన్నారు. బిజెపి కార్యాల‌యం ఈటెల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. కెసీఆర్ పాల‌న భ‌రించ‌లేక తెలంగాణ‌లో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేశార‌న్నారు.

Tags:    

Similar News