జ‌గ‌న్ స‌ల‌హాదారులు అస‌మ‌ర్ధులు

Update: 2021-06-22 13:29 GMT

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు ఏపీలోని స‌ల‌హాదారుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులుగా పెట్టుకుంటే... ఏపీలో మాత్రం అసమర్థులను సీఎం జ‌గ‌న్ సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయం పరిస్థితి చూస్తే రైతులకు ఏపీ సర్కారు ధాన్యం బకాయిలు చెల్లించలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని చంద్రబాబు విమ‌ర్శించారు. సంక్షేమం పేరుతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను మోసగిస్తున్నారని... ప్రజలకు జగన్ సర్కారు ఇచ్చింది గోరంత... దోచింది కొండంత అని ఆరోపించారు.

ఈ నెల 29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన కార్యక్రమం చేప‌డుతుంద‌ని తెలిపారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జులు, ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న చంద్రబాబు.... వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా రేప్‌లు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ రాజ్యమేలుతున్నాయన్నారు.జగన్ రెడ్డి ఇంటి సమీపంలోనే యువతిపై దారుణ అత్యాచారం జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమనన్నారు.

Tags:    

Similar News