నా సీఎం రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు
పార్టీలో విచ్చలవిడితనం పెరిగింది..కంట్రోల్ చేస్తా
అపులు పిట్టల మంత్రి..జగన్ రెడ్డి కడతారా?
వైసీపీలో అంతా బంట్రోతులే..అందుకే ఎవరూ నోరుతెరవరు
మీ పక్కన రౌడీలు ఉంటే..మా పక్కన ప్రజలు ఉన్నారు
విజయవాడ మేయర్ సీటు వైసీపీకి అప్పగిస్తే విజయవాడలోని మీ ఇళ్ళలో సగం వాటా అడుగుతారని..ఆలోచించి ఓటు వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల తరపున ఆయన ఆదివారం ఉదయం రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, వైపీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 'మీ పక్కన రౌడీలు ఉంటే ...మా పక్కన ప్రజలు ఉన్నారు. అన్ని చోట్లా బెదిరిరింపులే. వైజాగ్ లో చెబుతున్నారు. బ్రాందీ షాపులు డబ్బులు ఇవ్వాలట. ఎవడబ్బ సొమ్ము. బెదిరించి వసూళ్ళు చేస్తున్నారు. ఇది రాష్ట్రమా ఏమనుకుంటున్నారు మీరు. ప్రజలను బానిసలుగా చేస్తున్నారు. పిట్టల మంత్రి చెబుతున్నారు...అప్పు చేస్తే తప్పేంటి అని. నువ్వు కడతావా. జగన్ రెడ్డి కడతాడా? ప్రజలే కట్టాలి అప్పులు. ఆదాయనికి..అప్పులకు సరిపోయాయి. ఇక డబ్బులు లేవు... పనులు చేయటానికి. ఇసుక దొరుకుతుందా?. లిక్కర్ రేట్లు పెంచాడు. గ్యాస్ గుదిబండ అయిందా?. కందిపప్పు 150 రూపాయలు.
అన్నీ పెరిగిపోయాయి. రేపు, ఎల్లుండో మళ్ళీ వడ్డన వస్తోంది. ఏప్రిల్ ఫూల్ చేయబోతున్నారు. అదేంటి అంటే చట్టం ప్రకారం అంటున్నారు. మీరు కుక్క పిల్లలు పెంచుకున్నా పన్ను వేస్తున్నారు. విజయవాడలో ఎప్పుడూ డబ్బుల సంస్కృతి లేదు...ఈ రోజు బస్తాలకు బస్తాలు డబ్బులు వస్తాయి. ఇది తాత్కాలికం. గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే దాడులు..అందుకే వాళ్ళ వాళ్ళు ఎవరూ మాట్లాడరు..అందులో అంతా బంట్రోతులే. అందుకే ఎవరూ నోరుతెరవరు.మన పార్టీలో విచ్చలవిడి తనం ఎక్కువైంది. కంట్రోల్ చేస్తా. చెప్పకపోతే నేనేదో భయపడుతున్నాను అనుకుంటారు. అందుకే చెబుతున్నా. ప్రజల్లో ఉండేవారిని ఆదరిస్తా. రౌడీయిజం చేస్తామంటే కుదరదు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. రాష్ట్రానే దోచుకుంటున్నారు. విజయవాడలో మేయర్ వాళ్లు గెలిస్తే మీ ఇంట్లో సగం రాసివ్వమంటే రాసివ్వకపోతే మీ సంగతి అంతే. పెద్ద పెద్ద కోటీశ్వరుల అస్తులు హస్తగతం చేసుకున్నారు. విశాఖపట్నంలో రెండు కోట్ల ఆస్తు ఏ2 రాయించుకున్నాడు. అమరావతి పోయింది..విశాఖపోయింది..కర్నూలు..తిరుపతి పోయింది. అంతటా విధ్వంసం.
మీలో చైతన్యం వస్తే వీరోచితంగా పోరాడితే సైకిల్ గుర్తును గెలిపిస్తే ..తగ్గుతారు..మనుషులు భూమి మీదకు వస్తారు..లేక పోతే నన్ను కూడా లెక్క పెట్టరు..ప్రజలను లెక్కపెట్టరు. విజయవాడకు వచ్చింది మీ బాధ్యత చెప్పటానికి.కర్తవ్యాన్ని చెప్పటానికి. మీరు కూడా బాద్యత నెరవేర్చాలి. రేషన్ డోర్ డెలివరి కాదు...రేషన్ రోడ్డు డెలివరిగా మార్చారు ఎండ లో..వర్షంలో నిల్చోవాలి. విభేదాలు వద్దు..అందరం ఒఖటిగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. చిన్నచిన్నవి ఉంటే వదిలేయండి. మనందరి ధ్యేయం జగన్ రెడ్డిని ఇంటికి పంపాలి. ముఖ్యమంత్రి నాకు కొత్తా...నా రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు. సీఎం పదవి బాధ్యత తప్ప..అలంకారం కాదు. అసాధ్యం అనుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ను పూర్తి చేశాం. మనం ఉంటే ఇంకా బాగా చేసేవాళ్ళం' అంటూ టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.