భారత్ బయోటెక్ కు ఏజెంట్లుగా చంద్రబాబు అండ్ కో

Update: 2021-05-12 14:35 GMT

ఏపీలో ప్రస్తుతం వ్యాక్సిన్ రాజకీయం నడుస్తోంది. అధికార, విపక్షాల మధ్య దీనిపై శృతిమించి మరీ విమర్శలు చేసుకుంటున్నాయి. టీడీపీ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. 'కోవాగ్జిన్ ఫార్ములాను విస్తృతపరచాలని గొప్ప మనసుతో సీఎం జగన్ ప్రధానికి లేఖ రాస్తే చంద్రబాబు, ఆయన మీడియాకు ఉలుకెందుకు..?. కోవిడ్ తో ప్రజలు చనిపోతుంటే.. శ్మశానాల్లో శవాలను లెక్కలేస్తూ పైశాచిక ఆనందమా..?. భారత్ బయోటెక్ మీ బంధువులదో, మీ కులానికి చెందిన సంస్థ అయినంత మాత్రాన.. ఆ సంస్థ పేటెంట్ ఎందుకు వదులుకోవాలని చంద్రబాబు దగ్గర నుంచి ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడులు తెగ బాధపడిపోతున్నారని అన్నారు. అంటే, ప్రజల ప్రాణాల కన్నా, తమకు భారత్ బయోటెక్ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తూ... ఆ కంపెనీకి ఏజెంట్లుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తోందని జోగి రమేష్ విమర్శించారు.

మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలూ శ్రమిస్తుంటే, వ్యాక్సిన్ల కోసం ఎంతో ముందుచూపుతో ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖపై కూడా దేశవ్యాప్తంగా పలురంగాల ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతుంటే.. మూర్ఖుడిలా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ముఖ్యంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. శవాల దగ్గర డబ్బులు తీసుకునేవారికి, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం రేట్లు ఫిక్స్ చేసి బ్రోకరేజ్ చేసేవారికి, రెమెడిసివర్ల ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించి డబ్బులు గుంజేవారికి, ఏమాత్రం తీసిపోము అన్నట్టుగా.. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. మరోవైపు చంద్రబాబు, ఎల్లో మీడియా కనీసం మానవత్వం లేకుండా భారత్ బయోటెక్ కు భజన చేస్తున్నాయి.

హైదరాబాద్ లో కూర్చుని నిత్యం జూమ్ లో కాన్ఫరెన్సులు పెడుతూ.. క్లిష్ట సమయంలోనూ ప్రజలకు ఆండగా నిలబడకుండా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనేదో శాస్త్రవేత్తలా, ఈయనే కొత్త వైరస్ ను కనుక్కున్నట్లు ఎన్ 440కె అంటూ కబుర్లు చెబుతున్నాడు. మేమూ చెప్పలేమా.. జూబ్లిహిల్స్ రోడ్ నంబరు 65లో ఆ వైరస్ పుట్టిందని..? కేంద్ర పర్యవేక్షణలోనే వ్యాక్సిన్లు సరఫరా ఉందని తెలిసి కూడా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. హైదరాబాద్ లో కూర్చుని రాళ్ళు వేసి, ప్రజలు చనిపోతుంటే.. వెకిలి చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

Tags:    

Similar News