బిజెపి ఎంపీ దర్మపురి అరవింద్ తన వాహనంపై దాడి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీచేస్తానని..జీవన్ రెడ్డిని ఓడించకపోతే తన పేరు అర్విందే కాదని అన్నారు. తనపై జరిగిన దాడి పిరికిపందల చర్య అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను 50 వేల మెజారిటీతో జీవన్ రెడ్డిని ఓడిస్తానని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సెల్ ఫోన్లతో పడగొడతామని వ్యాఖ్యానించారు. ఆ పార్టీని రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. తనపై జరిగిన దాడిలో పోలీస్ కమిసనర్ పాత్ర ఉందని ఆరోపించారు. బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ సీఎం కెసీఆర్, డీజీపీలపై విమర్శలు గుప్పించారు.