టీఆర్ఎస్ హామీల వైఫల్యాలపై బిజెపి ఛార్జ్ షీట్

Update: 2020-11-22 16:21 GMT

గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి కాకపెంచుతోంది. పలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ..అధికార టీఆర్ఎస్ లో మాత్రం సెగ రగిలిస్తోంది. ఆ పని బిజెపి విజయవంతంగా చేస్తోంది. గతంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ చేసిన ప్రకటనలు..ఇచ్చిన హామీలనే బిజెపి తన ఛార్జ్ షీట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో ముఖ్యంగా లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, టీఆర్ఎస్ ప్రకటించిన హైదరాబాద్ డల్లాస్, ఇస్తాంబుల్ ల హామీలు, వంద రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామని మంత్రి కెటీఆర్ ఇచ్చిన హామీని..వంద గప్పాల ప్లాన్, హుస్సేన్ సాగర్ లోకి కొబ్బరి నీళ్ళెప్పుడూ, సాగర్ టవర్లు ఎంత ఎత్తుకో, విశ్వనగనం అంటే విధ్వంసమా?, ఉద్యోగాల టాస్క్ ఉత్తదేనా అంటూ ఇలా పలు అంశాలను బిజెపి తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ దీనిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు.

కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, హరీష్, కేసీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు. హైదరాబాద్‌లో పర్యటించిన జవదేకర్‌ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకం.. సుష్మా స్వరాజ్ లేకోయినా ఆమె పోరాటం మర్చిపోలేం. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరకీ తెలుసు'అని అన్నారు.

Tags:    

Similar News