ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి

Update: 2020-11-28 06:01 GMT
ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి
  • whatsapp icon

హైదరాబాద్ పోలీసులు తనపై పెట్టిన కేసుపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అరెస్ట్ ఇవాళ చేస్తారా?. రేపు చేస్తారా అని ప్రశ్నించారు. పీ వీ నరసింహరావు, ఎన్టీఆర్ లపై అక్భరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాతే తాను స్పందించానన్నారు. అసలు అక్భరుద్దీన్ వ్యాఖ్యలపై ఇఫ్పటివరకూ సీఎం కెసీఆర్ ఎందుకు నోరు తెరవలేదన్నారు. కెసీఆర్ ఎంఐఎం కొమ్ముకాస్తున్నారనే విషయం మరోసారి తేలిపోయిందని..తాను ఎంఐఎం వ్యాఖ్యలపై స్పందించానే తప్ప తనంతట తానుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

అయినా కూడా బిజెపి నేతలు కేసులు, అరెస్ట్ లకు భయపడరని అన్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సీఎం కెసీఆర్ ఆహ్వానం అవసరం లేదంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ ఉందో లేదో కెసీఆర్ చెప్పాలన్నారు. వరదలు వస్తే కూడా ఇంట్లో నుంచి బయటకు రాని సీఎం ఇఫ్పుడు వస్తారా? ఆయన చాలా బిజీగా ఉంటారు కదా అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News