అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారు

Update: 2022-04-13 11:51 GMT

అక్బ‌రుద్దీన్ ఓవైసీ గ‌తంలో చేసిన విద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌కు సంబంధించి కోర్టు తీర్పుపై తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసును న్యాయ స్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోంది.'15 నిమిషాలు సమయమిస్తే హిందువులందరినీ నరికి చంపుతామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. విన్నది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోంది. ఈ విషయంలో మేం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం లేదు. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం లేదు.

ఎందుకంటే న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కు అయ్యార‌న‌టానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?. • అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎం పార్టీకి అలవాటే. 2009లో అక్బరుద్దీన్ పై కేసు నమోదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంతో కుమ్కక్కై కేసును నీరుగార్చింది. హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్-టీఆర్ఎస్-ఎంఐఎం కుమక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.' అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News