తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ 'నిరుద్యోగ దీక్ష' చేపట్టారు. వాస్తవానికి ఈ 'నిరుద్యోగ దీక్ష' ఇందిరా పార్కు వద్ద నిర్వహించాల్సి ఉన్నా అనుమతులు రాకపోవటంతో బిజెపి కార్యాలయంలోనూ దీక్షకు కూర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ ఛుగ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, పార్టీ నేతలు విజయశాంతి, గరికపాటి మోహహన్ రావు, పొంగులేని సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్షలో నిరుద్యోగులు, బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున తరలివస్తున్న నిరుద్యోగులు తరలివచ్చారు.