అచ్చెన్నాయుడు అరెస్ట్

Update: 2021-02-02 04:43 GMT

పంచాయతీ ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లాల్లో ఉద్రిక్తత. మంగళవారం ఉదయం పోలీసులు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి..కొటబొమ్మాళి స్టేషన్ కు తరలించారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే అచ్చెన్నాయుడు బెదిరించనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు నిమ్మాడలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు ముందే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News