చంద్రబాబు నెక్ట్స్ కేబినెట్ లో నేనే హోం మంత్రి

Update: 2021-02-02 07:57 GMT

'వచ్చేది మా ప్రభుత్వమే. చంద్రబాబును అడిగి హోం మంత్రి తీసుకుంటా. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసుల సంగతి చూస్తా. వాళ్లు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టే ప్రశ్నేలేదు. నాయకులు కాదు. పోలీసులదే తప్పు. సీఐ, డీఎస్పీ ఏకంగా నా బెడ్రూమ్ లోకి వస్తారా?. పోలీసులు నోటీసులు ఇచ్చి ఉంటే నేనే వచ్చేవాడిని కదా?. కానీ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. దీనికి తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కొంత మంది పోలీసులు వైసీపీ కండువాలు వేసుకున్న కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు.

పోలీసు డ్రెస్ చూసి కూడా కొంత మందికి అసహ్యం వేస్తోంది.' అని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు. అరెస్ట్ అనంతరం పోలీసులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయమే అచ్చెన్నాయుడిని ఆయన స్వగ్రామం నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్ధిని బెదిరించారనే ఆరోపణలపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితోపాటు ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు.

Tags:    

Similar News