పోలీసుల విచారణకు హాజరైన అచ్చెన్నాయుడు

Update: 2021-01-28 11:12 GMT

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ లోకానీ, రిమాండ్ రిపోర్టులో తన పేరు లేకపోయినా బాధ్యతగల పౌరుడిగా విచారణకు హాజరయ్యాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పలాసలోని సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తరలింపు కేసులో డీఎస్పీ విచారణ జరిపారు. అంతకు ముందు అచ్చెన్నాయుడికి నోటీసులు ఇవ్వటంతో ఆయన విచారణకు హాజరయ్యారు. కాశిబుగ్గ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ శివరామిరెడ్డి అచ్చెన్నాయుడిని విచారించారు.

అచ్చెన్నాయుడికి మద్ధతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై పోలీసుల విచారణ పూర్తి అయ్యింది. కాశిబుగ్గ పోలీసు స్టేషన్‌లో కొద్దిసేపు అచ్చెన్నాయును డీఎస్పీ శివరామిరెడ్డి విచారించారు. సంతబొమ్మాళి పాలేశ్వర స్వామీ నంది విగ్రహం తరలింపు కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలపై అచ్చెన్నాయుడిని పోలీసులు విచారించగా.. కాశిబుగ్గ పోలీసు స్టేషన్‌ నుంచి తిరిగి పలాస టీడీపీ కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు.

Tags:    

Similar News