అరవింద్ కేజ్రీవాల్ కు అకస్మాత్తుగా దేవుళ్ళు ఎందుకు గుర్తువచ్చారో!

Update: 2022-10-26 10:39 GMT

Full Viewఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ లైన్ లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. బుధవారం నాడు అయన చేసిన డిమాండ్ దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరవింద్ కేజ్రీవాల్ కు అకస్మాత్తుగా దేవుళ్ళు ఎందుకు గుర్తుకు వచ్చారు అన్న చర్చ సాగుతుంది. కరెన్సీ, దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి అయన చేసిన కామెంట్స్ తో కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయారు అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్సలు కూడా వినిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కొంత మంది దేవుళ్ళ పేర్లు చెపితే ..తర్వాత మరికొంత ఇతర దేవుళ్ళ పేర్లు తేరా పైకి తీసుకొస్తారు. ఇది అనవసర వివాదం తప్ప మరొకటి కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.కేజ్రీవాల్ ఢిల్లీలో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశమని, అక్కడ కేవలం రెండు, మూడు శాతం మాత్రమే హిందువులు ఉన్నారని చెప్పారు. ఆ దేశంలో కరెన్సీ నోట్లపై విఘ్నేశ్వరుడి ఫొటో ఉంటుందని తెలిపారు. ఇండోనేషియా ఆ పని చేసినపుడు, మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు. మన దేశ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతోపాటు లక్ష్మీ దేవి, విఘ్నేశ్వరుడుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై త్వరలోనే తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాస్తానని తెలిపారు.

                                 దీనిపై బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ శాఖ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ స్పందిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి, ఆ పార్టీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు, ఇతర నేతలు హిందూ దేవీ, దేవతలను దూషించారని, అనేక రకాలుగా మాట్లాడారని, అయినప్పటికీ వారు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో వారి ముఖం చూపించుకోవడం కోసం కొత్త ఎత్తులు ఎత్తుతున్నారని చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించినవారు ఇప్పుడు కొత్త ముసుగు ధరించి వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, కేజ్రీవాల్ రాజకీయాలు యూ-టర్న్ తీసుకున్నాయన్నారు. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేందుకు తిరస్కరించిన వ్యక్తి కేజ్రీవాల్ అని తెలిపారు. అక్కడ చేసే పూజలను దేవుడు స్వీకరించడని ఆయన అన్నారన్నారు. కశ్మీరు నుంచి పండిట్లు మూకుమ్మడిగా పారిపోవడం అబద్ధమని ఆయన ఎగతాళి చేశారన్నారు. హియి. కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేయడం రాజకీయ జిమ్మిక్కు అని బీజేపీ ఆరోపించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేస్తున్నారని తప్పుపట్టింది. 

Tags:    

Similar News