జీహెచ్ఎంసీ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా నగరంపై పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన ఊపు ఆ పార్టీకి పెద్ద టానిక్ లో పనిచేస్తోంది. అదే దూకుడుతో బిజెపి నేతలు జోష్ పెంచి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులు ఇప్పటికే హైదరాబాద్ లో మకాం వేయగా..రాబోయే రోజుల్లో మరికొంత మంది రంగంలోకి దిగనున్నారు.
కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీ యేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్ ఇప్పటికే నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతలందరినీ మోహరించి హైదరాబాద్ బస్తీల్లో పావులు కదుపుతోంది.