Full Viewమహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటి వరకూ అందరికీ క్రికెటర్ గానే తెలుసు. ఇప్పుడు ఆయన కొత్త పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. అయితే ధోని జీవిత చరిత్రతో ఇప్పటికే ఎం ఎస్ ధోని..ది అన్ టోల్డ్ స్టోరీ అంటూ వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన విషయం తెలిసిందే. ధోని స్వయంగా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఆథర్వ ది ఆరిజన్ పేరిట ఇది తెరకెక్కనుంది. సైంటిఫిక్, పిక్షన్ కథగా దీన్ని నిర్మిస్తున్నారు.
నవల..దాని ఆధారంగా ఈ వెబ్ సిరిస్ నిర్మాణం జరుగుతోంది. గ్రాఫిక్స్ రూపంలో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో ధోని ఓ యోధుడిగా కన్పించే సన్నివేశాలతో కూడిన మోషన్ పోస్టర్ ను యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. అందులోనిదే ఈ ఫోటో కూడా. ఫస్ట్ లుక్ ను ధోని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా విడుదల చేశారు. రమేష్ తమిళ్ మని అనే రచయిత ఈ కధను సిద్ధం చేశారు.