మోడీ బిగ్ అనౌన్స్ మెంట్...20 లక్షల కోట్లతో ప్యాకేజీ

Update: 2020-05-12 15:16 GMT

నూతన మార్గదర్శకాలతో 4 వవిడత లాక్ డౌన్

ప్రధాని నరేంద్రమోడీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఆర్ధిక ప్యాకేజీపై మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. 20 లక్షల కోట్ల రూపాయలతో ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. ఇది దేశ జీడీపీలో పది శాతానికి సమానం. దేశంలోని అన్ని రంగాలను గాడిన పెట్టేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడబోతోందని తెలిపారు. ఈ కరోనా సంక్షోభాన్ని ఓ అవకాశంగా మార్చుకుని ముందుకెళ్ళటానికి ఇదే కీలక సమయం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్యాకేజీ వివరాలను ఆర్ధిక మంత్రి వెల్లడిస్తారని తెలిపారు. దేశంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడబోతందని వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా మారేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనాతో పోరాడుతూనే ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ఈ సారి తన ప్రసంగంలో ‘లోకల్’ అన్న అంశంపై స్ట్రెస్ చేశారు. దేశీయ ఉత్పత్తులను పెంచుకుని..దేశీయంగా వినియోగంపై ఫోకస్ పెట్టాలన్నారు. కొత్త ప్యాకేజీలో భూమి, కార్మికులు, లిక్విడిటీ, చట్టాల వంటి అంశాలు ఉంటాయన్నారు. ప్రతి రంగం పనితీరును ఈ ప్యాకేజ్ మెరుగుపరుస్తుందని తెలిపారు.

లాక్ డౌన్ కు సంబంధించి రాష్ట్రాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. కొత్త నిబంధనలతో నాల్గవ దశ లాక్ డౌన్ మే 18 నుంచి ఉంటుందని తెలిపారు. దీంతో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు అనివార్యం అని తేలిపోయింది. ‘అభివృద్ధి వైపు భారత్ విజయవంతంగా అడుగులేస్తోంది. కరోనా పై పోరాటాలు నాలుగు నెలలు గడిచాయి. దేశంలో అనేక మంది తమ వారిని కోల్పోయారు. ఈ విపత్తు కన్నామన సంకల్పం గొప్పది గా ఉండాలి. వైరస్ ప్రభావం మొదలైనప్పుడు ఏ దేశంలో ఒక పీపీఈ కిట్ లేదు. కానీ ఇఫ్పుడు ప్రతిరోజు రెండు లక్షల పీపీఈ కిట్లు తయారుచేస్తున్నాం . ప్రపంచంలో ఆత్మ విశ్వాసం నిర్వచనంగా మారిపోయింది. యుద్ధంలో ఓడిపోవడం, వెనకడుగు వేయడం సరికాదు. ఈ విపత్తు కన్నా మన సంకల్పం గొప్పది గా ఉండాలి. ఈ ప్రమాదం భారత్ కు ఒక సందేశాన్ని తీసుకొచ్చింది. దేశం ఐదు పిల్లర్లు పై నిలబడి ఉంది. ప్రపంచంలో జీవన్మరణ పోరాటం సాగుతోంది. ప్రపంచమంతా ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధం చేస్తోంది.

 

 

 

 

Similar News