కెసీఆర్ కరోనాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు

Update: 2020-04-07 08:33 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు సీఎం కెసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు. విమర్శించడానికి ఇది సమయం కాదని సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. కరోనాపై కేసీఆర్ ఎన్నిసార్లు మాటమార్చాడో చూసుకుంటే... ఆయనకే సిగ్గేస్తుందన్నారు. కరోనాపై మంచి సలహాలు ఇచ్చినోళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. కేసీఆర్ తప్పుడు పనులను ప్రశ్నిస్తే వాళ్లకూ కరోనా రావాలంటున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న కేసీఆర్ పై డీజీపీ కేసు పెట్టాలన్నారు. కరోనా అంశంపై ప్రధాని నరేంద్రమోడీ అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నారని..కెసీఆర్ మాత్రం ఏ పార్టీని సంప్రదించటంలేదని విమర్శించారు. ప్రపంచం మొత్తం కేసీఆర్ కు, ఆయన కొడుకుకే తెలుసా. రాజకీయ పార్టీలు, వైద్య నిపుణులతో సంప్రదించాల్సిన అవసరం లేదా...? అని ప్రశ్నించారు.

‘ప్రైవేటు వైద్య వ్యవస్థలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సోమరాజు, గురవారెడ్డి లాంటి ప్రముఖ వైద్యులతో సమావేశం ఎందుకు పెట్టరు. అన్నీ తనకే తెలిసినట్టు కేసీఆర్ బుర్ర లేకుండా వ్యవహరించవద్దు. మొదట్లో పారాసిటమల్ చాలన్నాడు...ఇప్పుడు భయంకరమైన రోగం అంటున్నాడు.... ఆయన ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా. ఏప్రిల్ ఏడు తర్వాత కరోనా లేదన్నాడు... ఇప్పుడు జూన్ మూడు అంటున్నాడు... సీఎం బాధ్యతగా ఉండక్కర్లేదా... నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటి?. రోజువారీ కూలీలకు కనీస వసతులు కల్పిస్తే వాళ్లు రోడ్లపైకి రారు. లాక్ డౌన్ కొనసాగించాలనుకుంటే దానికి తగ్గట్టుగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి... లేదంటే ప్రజల్లో అసహనం పెరుగుతుంది.’ అని వ్యాఖ్యానించారు.

 

Similar News