కరోనా నుంచి ఆ ప్రధాని సేఫ్

Update: 2020-04-12 14:29 GMT

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే అధికారిక విధులకు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మెడికల్ టీమ్ సూచన మేరకు ఆయన తిరిగి తన వర్క్ ను వెంటనే ప్రారంభించరని తెలిపాయి. సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్‌ హెల్త్ సిబ్బందికు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన ఆయన మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఏప్రిల్‌ 5న హాస్పిటల్‌కు వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే.

 

Similar News