పార్లమెంట్ ను కుదిపేసిన ఢిల్లీ అల్లర్ల అంశం

Update: 2020-03-02 06:50 GMT

విపక్షాలు ఢిల్లీ అల్లర్ల అంశాన్ని చేపట్టి ప్రభుత్వం ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశాయి. సోమవారం నుంచి రెండవ దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ లోపలా..బయటా ఇదే అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ తోపాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఢిల్లీ అల్లర్ల అంశంపై వెంటనే వాయిదా తీర్మానం కింద చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదుకు లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు అంగీకరించలేదు.దీంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. విపక్షాల ఆందోళనతో రెండు సభలు మధ్యాహ్నం వరకూ వాయిదా పడ్డాయి.

 

Similar News