ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కవిత

Update: 2020-03-18 10:49 GMT

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వెంటరాగా ఆమె నామినేషన్ కార్యక్రమం సాగింది. అసలు ఎమ్మెల్సీ పదవికి కవిత పేరు ఎక్కడా కూడా మంగళవారం వరకూ ప్రస్తావనకు కూడా రాలేదు. కానీ సడన్ గా మంగళవారం ఆమె పేరు తెరమీదకు రావటం..చకచకా నిర్ణయాలు వెలువడటం జరిగిపోయాయి.

ఓ రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వర్గాలను కూడా ఈ నిర్ణయం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించటం..ఆ వెంటనే కవిత నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు అందరితోనూ సమావేశం అయి...ఎన్నిక అంశంపై చర్చించారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

 

Similar News