కెసీఆర్ కు ఎక్కడో కాలుతుంది

Update: 2020-02-26 15:58 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే సీఎం కెసీఆర్ కు ఎక్కడో కాలుతుందని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. గోపన్‌పల్లిలో 1978లో రికార్డులు తారుమారు చేసి భూమికొన్నట్లు ఆరోపిస్తున్నారని, అప్పుడు తన వయసు ఆరేళ్లు అని, గోపన్‌పల్లి ఎక్కడుందో కూడా తెలియదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆస్తులను లిటిగేషన్‌లో పెడితే రేవంత్‌ లొంగుతాడని భావిస్తున్నారని, తన ఆస్తులన్నీ పోయినా... చివరి శ్వాస వరకు కేసీఆర్‌పై పోరాడతానని తెలిపారు.

పట్నం గోస పర్యటన రద్దు చేసుకోవాలని చిల్లర వ్యవహారాలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌ సెషన్‌ ముగిశాక కేటీఆర్‌, రామేశ్వరరావు అక్రమాలు బయటపెడతానన్నారు. ప్రభుత్వం పెట్టే కేసులు తనకు గౌరవమని, కేసీఆర్‌పై పోరాటానికి గుర్తింపన్నారు. ఈ కేసుల వల్ల తనకు లాభమే తప్ప... నష్టంలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన భూ లావాదేవీలు, పెట్టుబడులు, సోలార్ పవర్ ప్లాంట్ల వ్యవహారాలు అన్నీ బయటకు రాబోతున్నాయని అన్నారు.. ముందుంది ముసళ్ళ పండగ అని వ్యాఖ్యానించారు.

 

 

Similar News