అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉదయం భారత్ లో అడుగుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఆయన అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు. ట్రంప్ తోపాటు అమెరికా ప్రధమ మహిళ మెలానియా, ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్ లతో కూడిన బృందం భారత్ కు చేరుకుంది. వీరికి విమానాశ్రయంలో భారత ప్రధాని నరేంద్రమోడీ సాదర స్వాగతం పలికారు.
గుజరాతీ సంప్రదాయ నృత్యాలతోపాటు ఎంతో మంది కళాకారులతో అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. విమానం దిగిన వెంటనే ట్రంప్ ను మోడీ ఆలింగనం చేసుకున్నారు. స్వాగత కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన ప్రధాని నరేంద్రమోడీతో కలసి సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అహ్మదాబాద్ రహదారుల వెంబటి ఆయన ప్రయాణించిన 22 కిలోమీరట్ల దూరం లక్షలాది మంది ప్రజలు ట్రంప్ కు స్వాగతం పలికారు.