బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జె పీ నడ్డా

Update: 2020-01-20 09:57 GMT

బిజెపికి కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చేశారు. అమిత్ షా స్థానంలో ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న జె పీ నడ్డా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జేపీ నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌సింగ్‌ నియామకపత్రాన్ని అందజేశారు. నూతన అధ్యక్షుడునడ్డా సోమవార సాయంత్రం 4 గంటలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఐదున్నరేళ్లకు పైగా పనిచేసిన అమిత్‌ షా పార్టీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

అమిత్‌ షా హయంలోనే బీజేపీ కేంద్రంలో రెండు సార్లు, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్‌ షాకు కీలకమైన హోంమంత్రి పదవి దక్కింది. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. విద్యార్థి దశ నుంచే జేపీ నడ్డా పార్టీ కోసం పనిచేశారు. పలు అంశాలు జెపీ నడ్డాకు సానుకూలంగా మారి అధ్యక్ష పదవి వరించింది.

 

 

 

 

Similar News