కర్ణాటక ఫలితాలు..సిద్ధరామయ్య రాజీనామా

Update: 2019-12-09 15:49 GMT

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల సెగ కాంగ్రెస్ పార్టీకి తాకింది. తాజాగా వెల్లడైన 15 నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బిజెపి పార్టీ ఏకంగా 12 సీట్లు గెలుచుకోగా..కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితం అయింది. మరో సీటును స్వతంత్ర అభ్యర్ధి దక్కించుకున్నారు. దీంతో సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను సీఎల్పీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అదే సమయంలో శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. నాలుగు నెలల నుంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వ్యవహారం ఎన్నికల ఫలితాలతో ముగిసింది. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని..ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీ కె శివకుమార్ వ్యాఖ్యానించారు.

Similar News