అసెంబ్లీ భేటీకి ముందే టీడీపీకి భారీ షాక్?!

Update: 2019-12-04 08:12 GMT

ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రతిపక్ష టీడీపీకి షాక్ తప్పదా?. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ దిశగా సాగుతున్నట్లే కన్పిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి ఓ వికెట్ పడింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇఫ్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయన ఇప్పటివరకూ అధికారికంగా వైసీపీలో చేరలేదు కానీ సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారు. ఈ సారి ఆపరేషన్ ప్రకాశం జిల్లా నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఏకంగా అధికార వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నా ప్రస్తుతం ఇది మరింత జోరందుకున్నట్లు టాక్. ప్రకాశం జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో ముగ్గురిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను వైసీపీ ప్రారంభించింది. నేరుగా కొంత మంది మంత్రులు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.

తాము తలచుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని ఇఫ్పటికే వైసీపీ నేతలు పలుమార్లు ప్రకటించారు. ఇఫ్పుడు ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు కన్పిస్తోంది. టీడీపీకి ఉన్న 23 మంది శాసనసభ్యుల్లో కనీసం ఆరేడుగురిని ఆ పార్టీకి దూరం చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయటానికి రంగం సిద్ధం అయింది. గత ఎన్నికల్లో టీడీపీ ప్రకాశం జిల్లాలో నాలుగు చోట్ల.. చీరాల(కరణం బలరాం), గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి), పరుచూరు(ఏలూరి సాంబశివరావు), కొం డపి(డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి) గెలిచారు. వీరిలో ముగ్గురిని వైసీపీవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

 

 

Similar News