కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2019-10-02 13:47 GMT

తెలంగాణలో హాంకాంగ్ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ నిరంకుశ, నియంత తరహా పాలన అడ్డుకునేందుకు ఇదే మార్గమన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందన్న కేసీఆర్‌ కొత్త సచివాలయం ఎందుకు కడుతున్నాడని ప్రశ్నించారు. సచివాలయంపై హైకోర్టు తీర్పిచ్చినా ముందుకెళ్లుండడంపై పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటు దొంగలు హుజూర్‌నగర్‌పై పడ్డారని కోమటిరెడ్డి విమర్శించారు.

ఉప ఎన్నికల్లో ఒక్క మహిళను ఓడించడానికి సీపీఐ కాళ్లు పట్టుకున్నందుకు కేసీఆర్‌ సిగ్గుపడాలన్నారు. తమ పార్టీకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను (దేవరకొండ) కేసీఆర్‌ కొన్న విషయం సీపీఐ మర్చిపోయిందా? అని ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబరు 2 నుంచి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, తెలంగాణలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.

 

Similar News