ఏపీ మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతిపై రాజకీయ దుమారం సాగుతోంది. సర్కారు వేధింపు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని..ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు అందరూ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే ఆయన్ను టార్గెట్ చేశారని..అందుకే ఈ పరిస్థితి వచ్చిందని టీడీపీ విమర్శిస్తోంది. వైసీపీ కూడా అదే స్థాయిలో టీడీపీ విమర్శలను తిప్పికొడుతోంది.
కోడెల మరణానికి కారణాలు గా పలు అంశాలు తెరపైకి వస్తున్నాయని..గుండె నొప్పి, ఆత్మహత్య చేసుకుంటే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ తరహాలో తాము ఈ హత్యను రాజకీయాలకు వాడుకునే బుద్ది తమకు లేదని బొత్స మండి పడ్డారు. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా టీడీపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కోడెల ఆత్మహత్య బాధాకరం అన్న శ్రీకాంత్ రెడ్డి...టీడీపీ ఈ అంశాన్ని రాజకీయం చేయటం తగదన్నారు. టీడీపీ వైఖరి దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు.