చిదంబరంపై లుక్ అవుట్ నోటీసులు

Update: 2019-08-21 06:42 GMT

పి. చిదంబరం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన ఆయన ఇప్పుడు ఎవరికీ కన్పించకుండా తిరగాల్సిన పరిస్థితి. అంతే కాదు..దేశం విడిచిపెట్ట వెళ్ళకుండా విచారణా సంస్థలు ఏకంగా చిదంబరంపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి ఆయన కన్పించకుండా పోయారు. ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించటంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం అయింది.

అరెస్ట్ తప్పించుకునేందుకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసినా ప్రస్తుతానికి పెద్దగా ఊరట ఏమీ లభించలేదు. ఆయన ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌, దీనిపై తదుపరి ఆదేశాలిచ్చేందుకు నిరాకరించారు. ఈ పిటీషన్‌ను లంచ్‌ తరువాత సీజే రంజన్‌ గొగోయ్‌ విచారణ జరుతారని స్పష్టం చేసింది.

 

 

 

Similar News